ETV Bharat / crime

suicide attempt: తహసీల్దారు కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం - దోమ మండలంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వికారాబాద్​ జిల్లా దోమ మండల తహసీల్దారు కార్యాలయంలో ఓ వ్యక్తి పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నంచాడు. తన అవసరాలకోసం అమ్మిన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్​ చేయడం లేదని ఆరోపించాడు.

suicide attempt
suicide attempt
author img

By

Published : Sep 2, 2021, 9:32 PM IST

శస్త్ర చికిత్సకోసం డబ్బు అవసరమై భూమిని అమ్మగా... ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిష్ట్రేషన్​ చేయకుండా తహసీల్దారు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వికారాబాద్​ జిల్లా దోమ మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో పెట్రోల్​పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.

దోమ మండలం తిమ్మయిపల్లికి చెందిన సత్యయ్య.... ఆస్పత్రి ఖర్చుల కోసం తనకున్న ఎకరా 20 గుంటల భూమిలో ఎకరా భూమిని హైదరాబాద్​లోని ఓ వ్యక్తికి అమ్మాడు. అయితే ఈ భూమికి సంబంధించి కొనుగోలుదారుపేరుపై రిజిస్ట్రేషన్​ చేయడానికి ఇప్పటికే మూడు సార్లు ధరణి పోర్టల్​లో రిజిస్ట్రర్​ చేసుకున్నాడు. కానీ భూమి రిజిస్ట్రేషన్​ను చేయడం లేదు. ఈ విషయమై తహసీల్దారుకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు.

ఎన్నిసార్లు అభ్యర్థించినా భూమిని రిజిస్ట్రేషన్​ చేయడం లేదని... తహసీల్దారును అడిగితే ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని రిజిస్టేషన్​ చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని చెప్పినా స్పందించలేదని వాపోయాడు. గురువారం పెట్రోల్​ బాటిల్​తో సహా తహసీల్దారు కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపాడు. అప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడం వల్ల పెట్రోల్​పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. బాధితుడి సమస్యను తహసీల్దారుకు వివరించి న్యాయం జరిగేలా చూస్తామని కార్యాలయ సిబ్బంది తెలిపారు.

తహసీల్దారు కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి: gold seized: అధికారులే అవాక్కయ్యేలా... ఇలా కూడా బంగారం తరలించొచ్చా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.