ETV Bharat / crime

భార్య కాపురానికి రావడం లేదని.. సెల్​ టవర్​ ఎక్కి బెదిరింపులు - A man climbed a cell phone tower in mancherial district

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెల్​ఫోన్​​ టవర్​ ఎక్కి ఓ వ్యక్తి హల్​చల్​ సృష్టించాడు. భార్య కాపురానికి రావడం లేదని ఆవేదన చెందుతూ టవర్​ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

A man climbed a cell phone tower
మంచిర్యాలలో సెల్​టవర్​ ఎక్కి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Apr 11, 2021, 3:26 PM IST

భార్య కాపురానికి రావడం లేదని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ టవర్​ ఎక్కి హల్​చల్​ సృష్టించాడు ఓ వ్యక్తి. కార్యాలయం ఆవరణంలోని టవర్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​కు చెందిన సురేష్.. మంచిర్యాల పట్టణానికి చెందిన యువతిని ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తామామ తన భార్యా పిల్లలను పంపించడం లేదని సురేష్​ ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు నాలుగు గంటలపాటు హంగామా సృష్టించాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరాడు.

పట్టణ సీఐ ముత్తి లింగయ్య.. సురేష్​ భార్యకు ఫోనులో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె రావడానికి నిరాకరించింది. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో సురేష్​ ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: ట్రాన్స్​ఫార్మర్​ను పట్టుకున్న చిన్నారి... ప్రాణభిక్ష పెట్టాలంటున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.