ETV Bharat / crime

cheating with marriage proposal: మ్యాట్రిమోనీలో చూసి వలేశాడు.. ఆ వీడియోలు తీసి ఆన్​లైన్​లో... - తెలంగాణ వార్తలు

'మ్యాట్రిమోనీ వెబ్​సైట్​లో మీ పొఫైల్ చూశా.. బాగా నచ్చింది. ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నాను. రూ.లక్షకు పైగా జీతం వస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం' అంటూ ఆమెను నమ్మించాడు(love fraud in hyderabad) ఓ వ్యక్తి. ఏకాంతంగా గడపుదామని ప్రతిపాదించాడు(cheating with marriage proposal). కట్​చేస్తే ఆ వీడియోలు అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

a-man-cheated-woman-with-marriage-proposal-through-the-matrimony-in-hyderabad

author img

By

Published : Sep 28, 2021, 11:56 AM IST

Updated : Sep 28, 2021, 12:16 PM IST

'మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో చూశాను.. బాగా నచ్చావు.. పెళ్లి చేసుకుందామంటే' నమ్మింది. ఫోన్​ మాట్లాడుతూ... ఓ రోజు అతడితో ఏకాంతంగా గడిపింది(cheating with marriage proposal). ఆ వీడియోలు అంతర్జాలంలో ప్రత్యక్షం కావడంతో ఆమె కంగుతింది(matrimony love fraud in hyderabad). సరూర్‌నగర్‌ చెందిన బాధితురాలు(30) మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంది. ఓ రోజు 95732 05940 నంబర్‌ నుంచి ఆమెకు కాల్‌ వచ్చింది.

పరిచయం ఇలా..

అటువైపు నుంచి సుభాష్‌ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. హైటెక్ సిటీలో ఉంటానని, ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నానంటూ నమ్మబలికాడు. జీతం రూ.లక్షకు పైగా వస్తుందని చెప్పాడు. ఆమె ప్రొఫైల్ తనకు బాగా నచ్చిందని... ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామంటూ ప్రతిపాదించాడు. కొంతకాలం అలా చాటింగ్... ఆపై తరచూ ఫోన్​లో మాట్లాడుకున్నారు. ఒకరి అభిరుచులు మరొకరు పంచుకున్నారు. ఓరోజు కలుద్దామని మాదాపూర్‌కు ఆమెను రమ్మన్నాడు. ఇద్దరు ఏప్రిల్‌ 27న ఓ రెస్టారెంట్‌లో కలిశారు. భోజనం తర్వాత తన గదికి తీసుకెళ్లాడు. ఏకాంతంగా కలిసిన సమయంలో నిందితుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. కొన్ని రోజుల తర్వాత అవి అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి(cheating with marriage proposal).

డబ్బు కోసమేనా..

ఈ విషయాన్ని స్నేహితురాలు గుర్తించి బాధితురాలికి చెప్పగా... కంగుతిన్న బాధితురాలు సుభాష్​కు కాల్ చేసింది. డబ్బులివ్వాలని డిమాండ్ చేసి... లేదంటే ఆ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. డబ్బులు తీసుకునేందుకు తను రాకుండా స్నేహితుడిని పంపించాడు. డబ్బులిచ్చినా డిలీట్‌ చేయకపోవడంతో సుభాష్​కు కాల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా స్పందించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది.

ఇదీ చదవండి: Boy committed suicide : ఫోన్​ పగిలింది.. తల్లి కొడుతుందనే భయంతో బాలుడు ఆత్మహత్య

Last Updated : Sep 28, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.