ETV Bharat / crime

old city brutal murder: కారులోంచిలాగి కత్తులతో నరికి చంపారు.. - హైదరాబాద్​ నేర వార్తలు

పాతబస్తీ చాంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది (old city brutal murder). చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్‌ వైపు కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు... కారులోంచి బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

brutal murder
brutal murder
author img

By

Published : Oct 14, 2021, 4:59 AM IST

Updated : Oct 14, 2021, 5:08 AM IST

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణహత్య జరిగింది (old city brutal murder) . హస్మాబాద్ బండ్లగూడ రోడ్డుపై బార్కస్ ప్రాంతానికి చెందిన హమీద్ జుబేది... కారులో వెళ్తుండగా మారణాయుధాలతో దాడి చేసి నిందితులు హతమార్చారు (old city brutal murder).

మృతుడు హమీద్ జుబెది
మృతుడు హమీద్ జుబెది

అదే కారణమా..?

మృతుడు హమీద్‌ 2019లో రయీస్ జాబ్రీతో దుబాయ్ నుంచి కేజీ బంగారాన్ని హైదరాబాద్‌కు తెప్పించాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు రయీస్ జాబ్రిని అదుపులోకి తీసుకొని పాస్‌పోర్టు జప్తు చేసి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రయీస్ జాబ్రీ తన పాస్‌పోర్ట్ విడిపించడంతోపాటు డబ్బులు ఇవ్వాలని హమీద్‌తో గొడవపడుతున్నాడు. ఇదే విషయమై హత్య జరిగిన కొన్ని గంటల ముందే మృతుడు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఎస్సైపై చర్యలు..

సస్పెండైన చంద్రాయనగుట్ట ఎస్సై వెంకటేశ్​
సస్పెండైన చంద్రాయనగుట్ట ఎస్సై వెంకటేశ్​

ఈ క్రమంలో... రయీస్ జాబ్రీ మరో ఇద్దరితో కలిసి హమీద్‌పై దాడి చేసి హతమార్చాడు (old city brutal murder) సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కొనఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హత్య ఘటనతో... విధుల్లో నిర్లక్ష్యం వహించారని చాంద్రాయణగుట్ట ఎస్సై వెంకటేశ్​ను... సీపీ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేశారు (si suspension).

ఇదీ చూడండి: Husband Harassment: భార్య వేలు కట్​ చేసి భర్త పారిపోయాడు.. ఎందుకంటే..?

Last Updated : Oct 14, 2021, 5:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.