ఓ మహిళతో వివాహేతర సంబంధం స్నేహితుడిపై దాడికి పురిగొల్పింది. తాను ఓ మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు చెప్పాడనే కోపంతో స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ సంతోష్‌నగర్ ఠాణా పరిధిలో జరిగింది.
ఇదీ జరిగింది
షాహీన్‌నగర్‌కు చెందిన అక్బర్‌ఖాన్, సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఈషాఅలీ స్నేహితులు. అక్బర్‌ఖాన్ గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ మధ్యనే ఆమెకు మరో వ్యక్తితో వివాహమైంది. అయినప్పటికీ ఆమెను తరచు కలుస్తున్నాడు అక్బర్. తన స్నేహితుడు, మహిళకు మధ్య ఉన్న సంబంధం గురించి మహ్మద్ ఈషాఅలీ... ఆమె భర్తకు చెప్పాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి ఇషా అలీని కలిసి అడిగాడు అక్బర్ ఖాన్. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఈక్రమంలో అక్బర్‌ఖాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఈషాఅలీపై దాడి చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న సంతోష్‌నగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గాయపడిన ఈషాఅలీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ACCIDENT: ఆటోను ఢీకొట్టిన లారీ.. తొమ్మిది మందికి గాయాలు