ETV Bharat / crime

మహానగరంలో మాయలేడి.. అప్పులు తీర్చేందుకు నాటకం - Sulthana gang

మహానగరంలో మాయలేడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బును పదింతలు చేస్తానంటూ బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పులు తీర్చేందుకు ఓ మాయలేడీ సాగించిన మాయా నాటకానికి పోలీసులు తెరదించారు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే?

fraudster lady in hyderabad
మహానగరంలో మాయలేడి
author img

By

Published : May 7, 2022, 8:02 AM IST

కరోనాతో పెరిగిన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చేందుకు పేద, మధ్యతరగతి కుటుంబాలు నానాపాట్లు పడుతున్నాయి. ఇదే అదనుగా పెద్దఎత్తున సొమ్ములు సంపాదించేందుకు ఒక మాయలేడి 15 మందితో ముఠా ఏర్పాటు చేసి పథకం వేసింది. కొంతకాలం మోసాలు సాఫీగా సాగినా చివరకు రాచకొండ పోలీసులకు చిక్కి ముఠా సభ్యులతో సహా కటకటాలపాలైంది.

fraudster gang
మహ్మద్‌ఖాన్‌
fraudster gang
ఇమ్రాన్

అనుచరులకు డెమో తరగతులు : అగాపుర ప్రాంతానికి చెందిన చాంద్‌ సుల్తానా(55) సాధారణ గృహిణి. స్నేహితులు, బంధువుల నుంచి సొమ్ము తీసుకొని మరొకరికి అధిక వడ్డీలకు ఇస్తుండేది. అందులో నష్టాలు రావడం, అదనంగా తోడైన అనారోగ్య సమస్యలు, వైద్యఖర్చులు, రుణబాధల నుంచి బయటపడేందుకు పక్కా పథకం వేసింది. 15 మంది అనుచరులను రంగంలోకి దింపి సుల్తానా అతీంద్రియ శక్తులతో సొమ్ము నాలుగైదు రెట్లు అధికం చేస్తుందంటూ ప్రచారం చేయించింది. వీరిమాట నమ్మి వచ్చే బాధితులను.. చాలా తెలివిగా బురిడీ కొట్టించేవారు. అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతంలోనే పూజలు చేయాలని, అక్కడైతే మాత్రమే కోరికలు సిద్ధిస్తాయంటూ బుట్టలో పడేసేవారు. ఈ విషయంలో అనుచరులకు డెమో తరగతులు కూడా ఆమె నిర్వహించేదని పోలీసులు తెలిపారు.

fraudster gang
డి.శ్రీనివాస్‌
fraudster gang
ఎం.రాజు

రూ.5 వేలు ఇస్తే యాభై వేలు చేస్తా : బాధితుడి నుంచి రూ.5000 తీసుకొని పూజలో ఉంచేవారు. ఆమె వచ్చి చేతి రుమాలు నుంచి రూ.50,000 తీసి పైకి విసిరేది. ఇంతలోనే అనుచరులు వచ్చి పోలీసులమంటూ హడావుడి చేసేవారు. బాధితులు సొమ్ము అక్కడే వదిలేసి పారిపోయేవారు. ఈ ముఠాపై మాదాపూర్‌, కుల్సుంపుర, నగర సీసీఎస్‌, రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇలాగే రూ.11లక్షలను రూ.5 కోట్లుగా మార్చుతుందని స్నేహితుడు మహేశ్​ చెప్పడంతో హస్తినాపురం వాసి శ్రీనివాసరెడ్డి ఈ నెల ఒకటిన రాత్రి విశ్వేశ్వరయ్య కాలనీలో పూజకు ఏర్పాట్లు చేశారు. రూ.11లక్షలు నగదు పూజలో ఉంచారు. రాత్రి 11 గంటల తరువాత ఆమె అనుచరులు వచ్చి కర్రలతో దాడి చేసి పూజలో ఉంచిన రూ.11లక్షలు, చాంద్‌సుల్తానాను తీసుకుని వెళ్లిపోయారు.

బాధితుడు మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యంలో ఏసీపీలు పురుషోత్తంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు మహేందర్‌రెడ్డి, రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన సూత్రధారి చాంద్‌సుల్తానాతో సహా మహ్మద్‌ఖాన్‌, పి.వినోద్‌ ఎం.రాజు, డి.శ్రీనివాస్‌(45), ఇమ్రాన్‌(31)లను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. పోలీసు అధికారులను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు.

ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.54 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

హెల్పర్​ను చంపి.. శవాన్ని మాయం చేసి.. 7 నెలలు పోలీసులకు చుక్కలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.