కేరళలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి చనిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు కేరళ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగానే ఇడుక్కి జిల్లా మున్నార్ సమీపంలోని చునయమ్మక్కల్ జలపాతం వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలోనే కొత్తపేటకు చెందిన సందీప్ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు వెతకగా సందీప్ మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇవీ చదవండి: ఐటీ అధికారులమని కిడ్నాప్.. డబ్బులు తీసుకున్నాక రిలీజ్..
అనేక ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. గ్రామం విడిచి పారిపోయిన పురుషులు..