ETV Bharat / crime

fire accident: హైదరాబాద్​ శివారులో అగ్ని ప్రమాదం - hyderabad fire accident news

హైదరాబాద్​ నగర శివారులోని మేడ్చల్‌ జిల్లాలో ఫార్మా పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం(fire accident) సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు తీస్తూ పరిశ్రమ నుంచి బయటకు వచ్చారు. దీంతో పెను ముప్పు తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని... నాలుగు అగ్నిమాపక శకటాలతో అయిదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

fire accident at medchal district
హైదరాబాద్​ శివారులో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jun 20, 2021, 9:59 AM IST

Updated : Jun 20, 2021, 10:06 AM IST

fire accident: హైదరాబాద్​ శివారులో అగ్ని ప్రమాదం

మేడ్చల్‌ జిల్లా ముడి చింతలపల్లి మండలం జగ్గనగూడలోని అల్ఫామేడ్‌ ఫార్మా సొల్యుషన్స్‌ సంస్థలో అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. శనివారం రాత్రి పరిశ్రమలోని కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. గమనించిన అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పరిశ్రమ లోపలి నుంచి పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. చూస్తుండగానే పరిశ్రమ అంతటా విస్తరించాయి.

ప్రమాదంలో ఔషధాలకు సంబంధించిన ముడి పదార్ధం మొత్తం అగ్నికి ఆహుతైంది. పరిశ్రమలోనే వేర్‌హౌస్‌ ఏర్పాటు చేసినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇది కూడా కారణమని తెలుస్తోంది. ఈ పరిశ్రమలో అగ్నిమాపక ప్రమాణాలు లేనట్టు అధికారుల పరిశీలనలో బయటపడింది.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని... అయిదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు అధికారులు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భారీ ప్రమాదం జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి: రెచ్చిపోయిన దొంగలు.. 3.2 తులాల బంగారం అపహరణ

Last Updated : Jun 20, 2021, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.