మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో గ్రనేడ్ కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రం సమీపంలోని ధర్మాపూర్ గ్రామ శివారులో ఉన్న కొండ ప్రాంతంలో గ్రనేడ్ లభ్యమైంది. గ్రామానికి చెందిన ఓ మహిళా పశువులను మేపుతుండగా గ్రనేడ్ కనిపించగా... ఈ విషయాన్ని సర్పంచ్ దృష్టికి ఆమె తీసుకెళ్లారు. సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు.
ఇదే ప్రాంతంలో ఇంకా వేరేచోట మరేమైనా ఉన్నాయా అని మహబూబ్నగర్ గ్రామీణ పోలీసులు గాలిస్తున్నారు. ఈ గ్రనేడ్ మావోయిస్టులకు సంబంధించినదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అందాల లోగిలి.. మృత్యు కౌగిలి