ETV Bharat / crime

కారుతో ఢీకొట్టి... కత్తులతో తెగనరికి.. - telangana latest crime updates

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని దారుణంగా చంపేశారు. కారుతో ఢీకొట్టి కత్తులతో విచక్షణా రహితంగా నరికారు.

A government employee was brutally killed in Mahabubnagar district.
కారుతో ఢీకొట్టి... ఆపై కత్తులతో దాడి
author img

By

Published : Mar 11, 2021, 10:00 AM IST

Updated : Mar 11, 2021, 11:25 AM IST

మహబూబ్ నగర్ పట్టణంలో బుధవారం అర్థరాత్రి హత్య జరిగింది. పట్టణంలోని భగీరథ కాలనీ, షాసాహెబ్ గుట్ట రహదారిపై పసుల క్రిష్ణారెడ్డి ఫంక్షన్ హాల్​కు సమీపంలో నరహరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయున్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరహరిని కారుతో ఢీకొట్టి, అనంతరం కత్తులతో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే అతను మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారుని దుండగులు సంఘటనా స్థలం వద్దే వదిలేసి వెళ్లిపోయారు. వ్యాపార, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:లోయలో పడ్డ బస్సు- 27మంది యాత్రికులు మృతి

Last Updated : Mar 11, 2021, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.