రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ వేధింపులు తట్టుకోలేక ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన మాచర్ల వెంకన్న(35)... 2019లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా చేరాడు.
తన భర్త ఎక్కడ పని చేసినా ఇబ్బంది పడలేదని.. ముస్తాబాద్ వచ్చిన తర్వాతే ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని మృతుడి భార్య పద్మ తెలిపారు. ఆదివారం సైతం సెలవు ఇవ్వకుండా తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతోనే... తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: హంతకులను పట్టించిన సైకిల్ తాళం చెవి