కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లిలో విషాదం చోటు చేసుకుంది. హుజూరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. పీజీ పరీక్ష రాసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న యువతిని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జంగపల్లి మౌనిక (23) అక్కడికక్కడే మృతి చెందింది.
గంగాధర మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన జంగపల్లి మౌనిక (23) సింగాపూర్‌లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో సదాశివపల్లి వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.