మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై పడుకొని పొర్లు దండాలు పెడుతూ హంగామా చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బుపేష్ గుప్తా నగర్లో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఉన్న మందుబాబు నల్ల పోచమ్మ దేవాలయం వద్ద నడి రోడ్డు పై పడుకొని పొర్లుకొంటు వెళ్లి అమ్మవారికి మొక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులకు ఇబ్బంది కలిగింది. తాగుబోతు వ్యవహార తీరు విచిత్రంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఇదీ చదవండి:కార్పొరేటర్లు విప్ ధిక్కరిస్తే అనర్హులవుతారు: ఎస్ఈసీ