ETV Bharat / crime

doctor hulchal: వైద్యుడు హల్‌చల్.. భోజనం చేసేందుకు వచ్చి కత్తితో దాడి - doctor halchal in giddaluru

Doctor hulchal:ఓ వ్యక్తి భోజనం కోసం రెస్టారెంట్​కు వచ్చాడు. తనకు కావాల్సిన వాటిని ఆర్డర్ పెట్టాడు. చిన్నగా తనతో తెచ్చుకున్న మందు సీసాని తాగడానికి బయటికి తీశాడు. అది గమనించిన రెస్టారెంట్ నిర్వాహకుడు.. ఇది రెస్టారెంట్ అనీ, ఇక్కడ మద్యం తాగడానికి అనుమతి లేదని చెప్పాడు. దాంతో కోపం తెచ్చుకున్న సదరు వ్యక్తి.. విచక్షణ కోల్పోయాడు. రెస్టారెంట్లో కూరగాయలు కోయడానికి సిద్ధంగా ఉన్న కత్తి తీసుకొని సిబ్బందిపై దాడికి యత్నించాడు..!

doctor hulchal
ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైద్యుడు హల్‌చల్
author img

By

Published : Mar 24, 2022, 6:19 PM IST

Doctor Hulchal: తాను తెచ్చుకున్న మద్యం తాగేందుకు.. రెస్టారెంట్​ వాళ్లు అనుమతి ఇవ్వలేదని ఓ డాక్టర్.. కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. పట్టణ సమీపంలోని ఓ రెస్టారెంట్​కి.. అనుమలవీడు పీహెచ్​సీ ప్రభుత్వ వైద్యుడు భానుకుమార్ రెడ్డి వచ్చాడు.

భోజనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత తనతోపాటు తెచ్చుకున్న మందు బయటికి తీశాడు. ఇది చూసిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఇక్కడ మందు తాగడానికి అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు డాక్టర్.. రెస్టారెంట్​లో కూరగాయలు కోసే కత్తి తీసుకుని సిబ్బందిపై దాడికి యత్నించాడు. భానుకుమార్ రెడ్డిని రెస్టారెంట్ సిబ్బంది నిలువరించేందుకు ప్రయత్నించగా.. కత్తితో చుట్టుపక్కల అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో భానుకుమార్ రెడ్డిపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.