పేకాటలో జరిగిన చిన్న వివాదం ఓ దివ్యాంగుడిపై దాడికి కారణమైంది. తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బైరన్‌దిబ్బ గ్రామంలో జరిగింది.
జిల్లాలోని బైరన్‌దిబ్బ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల బస్వరాజ్ అనే దివ్యాంగుడు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం కొంత మందితో కలిసి గ్రామ శివారులో పేకాట ఆడాడు. ఈ క్రమంలో బస్వరాజ్‌కు, కోళ్లపల్లి భాస్కర్ అనే వ్యక్తితో డబ్బు పంపకం విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో తీవ్రగాయాలపాలైన బాస్వరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: శంషాబాద్లో కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు