ETV Bharat / crime

తల్లి పింఛన్‌ డబ్బులు ఇవ్వడం లేదని ఓ కూతురి ఘాతుకం - A daughter murdered her mother in medak district

పింఛన్‌ డబ్బులు ఇవ్వడం లేదని ఓ కూతురు తన కన్నతల్లినే హతమార్చింది. కల్లు సీసాతో పొడిచి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

తల్లి పింఛన్‌ డబ్బులు ఇవ్వడం లేదని ఓ కూతురి ఘాతుకం

author img

By

Published : Jun 4, 2021, 2:30 PM IST

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. పింఛన్‌ డబ్బులు ఇవ్వడం లేదని నయీమా అనే మహిళ తన కన్నతల్లిని హత్య చేసింది. గ్రామానికి చెందిన షేక్ మగ్బుల్-అప్సానా భార్యాభర్తలు. పదేళ్ల క్రితం మగ్బుల్ మృతి చెందగా.. కూలీ పనులు చేస్తూ కూతురు నయీమాను పెంచి పోషించింది. కొద్దిరోజుల క్రితం నయీమా ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్ వెళ్లిపోయింది. అక్కడే నివాసం ఉంటోంది.

ఇటీవల అప్సానా కాలికి గాయమై అనారోగ్యం బారినపడటంతో కూతురు నయీమాను సహాయం కోసం పిలిపించుకుంది. నయీమా వచ్చినప్పటి నుంచి పింఛన్‌ డబ్బుల కోసం తల్లితో గొడవ పడేది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి జరిగిన గొడవ తీవ్రం కావడంతో నయీమా కల్లు సీసాతో తల్లి అప్సానాను పొడిచి చంపేసింది.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Cyber Crime: మాటలతో ఎరవేసి.. ఆన్‌లైన్‌లో దోచేసి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.