అనుమానాస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దిండి మండలం ఖానాపూర్కు చెందిన సైదులు నల్గొండ జిల్లా మర్రిగూడలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: హోలీ వేడుకల్లో అపశృతి.. చెరువులో గల్లంతై వ్యక్తి మృతి