ETV Bharat / crime

woman constable suicide: ఉరి వేసుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య - చిత్తూరు జిల్లా కార్తికేయపురంలో మహిళ ఆత్మహత్య

ఏపీలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కార్తికేయపురంలో జరిగింది.

woman constable suicide
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
author img

By

Published : Aug 9, 2021, 1:39 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కార్తికేయపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కార్తికేయపురం గ్రామానికి చెందిన సుకన్య.. 2014లో కానిస్టేబుల్​గా ఎన్నికైంది. ఆత్మహత్యకు ముందు తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తించింది. ఐదేళ్ల క్రితం గ్రామానికి చెందిన ప్రసాద్​తో ఆమెకు వివాహమైంది.

సుకన్య - ప్రసాద్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మొదటి పాపకు మూడేళ్లు గాగా.. రెండో పాప వయసు రెండు నెలలే. రెండో పాప పుట్టిన అనంతరం ఆపరేషన్ చేయించుకుని కార్తికేయపురంలోని అత్తగారి ఇంట్లోనే అంతా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది.

పాప ఏడుస్తుండటంతో..

ఇంట్లో చిన్నారి ఏడుస్తుంటే గమనించిన స్థానికులు.. తల్లి కోసం చుట్టుపక్కల వెదికారు. ఈక్రమంలో ఇంటికి సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న సుకన్యను గుర్తించి కేకలు వేస్తూ.. గ్రామస్థులకు సమచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుకన్య ఆత్మహత్యకు గల కారణాలు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

Road accident: ఆటో, కారు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.