ETV Bharat / crime

ఆటోను ఢీకొట్టిన కారు.. విద్యార్థులకు గాయాలు

SCHOOL AUTO ROLL OVER: రోజులాగానే ఆ పిల్లలు ఉత్సాహంగా ఆటోలో పాఠశాలకు బయలుదేరారు. అలా కాసేపు బాగానే గడిచింది. కానీ అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

STUDENTS AUTO ROLL OVER
విద్యార్థుల ఆటో బోల్తా
author img

By

Published : Apr 11, 2022, 12:41 PM IST

SCHOOL AUTO ROLL OVER: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆటోను కారు ఢీ కొట్టడంతో విద్యార్థులకు స్వల్పగాయాలు అయ్యాయి. మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆటో బరాకత్​ గూడెం నుంచి విద్యార్థులను ఎక్కించుకొని మునగాల వైపు వెళ్తుండగా విజయవాడ నుంచి వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న 10 మంది విద్యార్థులతో సహా ఒక టీచర్, ఆటో డ్రైవర్​కు గాయాలయ్యాయి.

వీరందరిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు స్వల్పగాయాలతో బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: btech student suicide: 'క్విట్టింగ్‌ మై లైఫ్‌.. సారీ మమ్మీ డాడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.