మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండాలో రైతు గుగులోత్ మంగ్యాకు చెందిన ఎద్దు మృత్యువాత పడింది. ఉదయం మేత కోసం వెళ్లిన మూగ జీవి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. సొంత పిల్లల్లా భావించి పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
అందరూ ఎద్దు మృతదేహంపై పడి మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అంటూ విలపించారు. ఈ దృశ్యం అందరినీ కలిచివేసింది. దీని విలువ సుమారు 70 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. ఎద్దు మృతితో తమ జీవానాధారం కోల్పోయామని... అధికారులే తమను ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!