ETV Bharat / crime

ఉప్పల్​ తండ్రీకుమారుల హత్య కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

Uppal Father and Son Murder Case Update: ఉప్పల్​లో శుక్రవారం జరిగిన తండ్రీకుమారుల హత్య కేసులో రాచకొండ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆస్తి గొడవలే కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

brutal murder
దారుణ హత్య
author img

By

Published : Oct 15, 2022, 3:13 PM IST

Uppal Father and Son Murder Case Update: హైదరాబాద్ ఉప్పల్ పోలీస్​స్టేషన్ పరిధి హనుమాన్ నగర్‌లో శుక్రవారం జరిగిన పూజారి నరసింహశర్మ, ఆయన కుమారుడు శ్రీనివాస్ హత్య కేసు ఛేదించేందుకు రాచకొండ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున మారణాయుధాలతో దాడి చేసి తండ్రీకుమారులను హత్య చేశారు. కుటుంబ ఆస్తి గొడవలే కారణమని మృతుడు నరసింహ శర్మ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు పోలీసులకు చెప్పడంతో నరసింహ శర్మ సోదరుడు, సోదరిని, వారి కుమారులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

అయితే విచారణలో వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైనట్లు సమాచారం. సోదరి, సోదరులను విడిచిపెట్టిన పోలీసులు.. వారి ఇద్దరు కుమారులను మాత్రం లోతుగా విచారిస్తున్నారు. హత్యకు గురైన స్థలంలో సీసీ కెమెరాలు ఉన్నా.. అవి 5 రోజులుగా పని చేయడం లేదు. దీంతో దర్యాప్తునకు ఆటంకం ఏర్పడింది. సమీపంలో ఉన్న వేరే సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దగ్గరలోని ప్రైవేటు వసతి గృహంలో ఉన్న వారినీ ప్రశ్నిస్తున్నారు. హంతకులకు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుందని.. టీ షర్ట్, ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అసలేం జరిగింది.. హనుమాన్​ నగర్​లో నివాసం ఉంటున్న నరసింహమూర్తి(70)పై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న తెల్లవారు జామున మరణాయుధాలతో దాడి చేశారు. అడ్డుకోపోయిన కొడుకు శ్రీనివాస్​పైనా దుండగులు దాడి చేయడంతో తీవ్రగాయలతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ‌ నరేష్ రెడ్డి, సీఐ గోవిందా రెడ్డి ఘటన స్థలికి చేరుకొని హత్యలకు గల కారణాలపై వెలికితీస్తున్నారు. ఆస్తి కోసమే దగ్గరి బంధువులు హత్య చేశారా! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాస్​ సింగపూర్​ నుంచి నెల రోజుల కిందటే ఉప్పల్​కు రాగా.. నరసింహమూర్తి జోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.