A boy road accident in Oldcity: నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మెున్న మెడ్చల్ రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మరణ వార్త మరువక మునుపే.. ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీలు మన కళ్లపై ఇంకా కదలాడుతుండగానే తాజాగా పాతబస్తీలో అభంశుభం తెలియని పసిపిల్లాడిపై ఆర్టీసీ బస్సు పడగవిప్పింది. దీంతో బాలుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్లోని పాతబస్తీలో పురాని హావేలి ప్రాంతంలో గత మంగళవారం ఆర్టీసీ బస్సు బైక్పై వెళ్తున్న వారిపైకి వెనుక నుంచి ఢీకొంది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి, తన మేనల్లుడు హుస్సేన్(5)కి త్రీవ గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: