ETV Bharat / crime

బ్యాంక్​ ఉద్యోగి ఘరానా మోసం.. నకిలీ బంగారంతో రూ.కోటి కాజేశాడు.. - అప్రైసర్‌ కాకర్ల శేఖర్ బాగోతంతో బయటపడ్డ అవినీతి

అందరిలా రోజంతా కష్టపడి ఎందుకు పని చేయాలనుకున్నాడో ఏమో.. తన వద్దకు వచ్చే బంగారాన్ని చూసి వాటికి విలువ కట్టాల్సిన అతనికి మనసులో దురాశ కలిగింది. అన్నీ తానే అయినప్పుడు అడిగే వారెవ్వరు అనుకున్నాడు. అందుకోసం విడతల వారీగా బ్యాంక్​లో నకిలీ బంగారాన్ని జమ చేస్తూ డబ్బులను కాజేశాడు. అలా ఒకటో, రెండో గ్రాములు కాదు సుమారు కేజీ 87 గ్రాముల నకిలీ బంగారాన్ని పెట్టి.. రుణం తీసుకున్నాడు. అధికారుల తనిఖీల్లో విషయం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు.

BANGARAM
BANGARAM
author img

By

Published : Oct 2, 2022, 8:53 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి ఎస్​బీఐ బ్యాంకులో నకిలీ బంగారంతో రూ.కోటికిపైగా నగదు కాజేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాకర్ల శేఖర్ 2015 నుంచి ఎస్​బీఐ ఓబిలి బ్రాంచ్‌లో అప్రైసర్‌గా పని చేస్తున్నాడు. ఇతను రోల్డ్‌గోల్డ్ నగలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడు. కాకర్ల శేఖర్​ ఇలా నకిలీ ఆభరణాలు పెట్టి.. 5 గోల్డ్ లోనులు, భార్య జయలక్ష్మీదేవి పేరిట నాలుగు గోల్డు లోనులు తీసుకున్నాడు. మొత్తం 13,87 గ్రాముల నకిలీ బంగారం తనఖా పెట్టి.. రూ.39 లక్షల 41 వేల రుణం తీసుకున్నాడు. బాగా పరిచయమున్న 9 మందిని నమ్మించి.. వారి పేరిట 3,433 గ్రాముల నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. రూ.కోటీ 52 వేల రుణం తీసుకున్నాడు.

ఇలా తీసుకున్న డబ్బుతో విలువైన కార్లు, సెల్ ఫోనులు, బంగారం వంటి విలువైన వస్తువులు కొని.. జల్సాలకు అలవాటుపడ్డాడు. గత నెలలో ఓబిలి బ్రాంచ్‌లో త్రైమాసిక తనిఖీలు నిర్వహించిన సమయంలో గోల్డ్ లోన్​లకు సంబంధించిన ఆభరణాలు పరిశీలించగా.. అప్రైసర్‌ కాకర్ల శేఖర్ బాగోతం బయటపడింది. 30 గోల్డ్ లోనులకు సంబంధించిన ఆభరణాలన్నీ నకిలీగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజంపేట రీజనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొండూరు క్రాస్ వద్ద కాకర్ల శేఖర్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతని వద్ద నుంచి డబ్బులు, విలువైన వస్తువులు సీజ్ చేశామని రాజంపేట డీఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.