ETV Bharat / crime

Rape: నల్గొండ జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై వృద్ధుడు లైంగిక దాడి - crime news

Rape: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలుడి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rape
బాలుడిపై వృద్ధుడు లైంగిక దాడి
author img

By

Published : Apr 5, 2022, 7:56 PM IST

Updated : Apr 5, 2022, 9:05 PM IST

Rape: ఆరేళ్ల బాలుడిపై అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలునిపై రాములు అనే వృద్ధుడు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు బాలున్ని చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించిన ప్రాథమిక అంచనా ప్రకారం బాలునిపై అత్యాచారం జరిగినట్లుగా తెలిపారు. రాములు కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తాడని పోలీసులు తెలిపారు. బాలుని తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాములుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

'మిర్యాలగూడ రూరల్ పీఎస్​ పరిధిలో ఆరేళ్ల బాలుడిపై వృద్ధుడు అత్యాచారం చేసినట్లు తెలిసింది. వెంటనే మేము అక్కడికి చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించాం. వైద్యుల నివేదికలో అత్యాచారం జరిగినట్లు తేలింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులతో ఫిర్యాదు తీసుకున్నాం. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం.'

- సత్యనారాయణ, మిర్యాలగూడ రూరల్ సీఐ

ఇదీ చూడండి: పాఠశాలకు వెళ్తున్న బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Last Updated : Apr 5, 2022, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.