3 Years Old Boy Died: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారంలో గోడ కూలి మూడు సంవత్సరముల బాలుడు మృతి. దీంతో గ్రామస్థులందరూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీఎండీసీ) వద్ద నిరసనకు దిగారు. ఏపీఎండీసీ ఆఫీసును ముట్టడించారు. మంగంపేట అగ్రహారం దశాబ్ద కాలంగా ఏపీఎండీసీ బేరైటీస్ గనులకు 50 మీటర్ల దూరంలోనే ఉన్నందున గనులలో బ్లాస్టింగ్ వల్ల ఈ విషాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
మంగంపేటలో ఉన్న గ్రామాన్ని ఏపీఎండీసీ విస్తరణలో భాగంగా కొండ పక్కకు మార్చారు. ఈ గ్రామం డేంజర్ జోన్ పరిధిలోకి రావడంతో అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించాలంటూ గత దశాబ్ద కాలంగా గ్రామస్థులు పోరాటం చేస్తున్నామని స్థానికులు తెలిపారు. మంగంపేట ఏపీఎండీసీ గనులలో బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు నెర్రులు చీలి పడిపోతున్నయంటూ గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు.
నిన్న సాయంత్రం మూడు సంవత్సరాల బాలుడు గోడకూలి అక్కడికక్కడే మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ నిర్లక్ష్య వైఖరి వల్ల మా గ్రామం ఇబ్బందులకు గురవుతుందంటూ గ్రామస్థులు తెలిపారు. గనులలో బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా దుమ్ము ధూళి రాళ్లతో సహా మా గ్రామంలో పడుతున్నాయని వాపోయారు. అధిక మొత్తంలో బ్లాస్టింగ్ చేయడం వలన ఇళ్లన్ని ఎప్పుడు కూలుతాయో, అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: