Ganza seized in Hyderabad: హైదరాబాద్లో మరోసారి గంజాయి గుప్పుమంది. ఏకంగా రూ.90 లక్షల విలువైన 240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ నుంచి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న 10 మందిని రాచకొండ ఎస్వోటీ పొలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 లక్షల నగదు, ఓ లారీ, రెండు కార్లు, 19 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు పట్టుకున్న దాంతో కలిపి ఈ ఏడాది 5 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని రాచకొండ సీపీ మహేష్భగవత్ తెలిపారు.
పరారీలో కీలక నిందితుడు..
"ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ముఠాను వనస్థలిపురంలో అరెస్ట్ చేశాం. ఏవోబీ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని ముంబయి తరలిస్తుండగా పట్టుకున్నాం. 240 కేజీల గంజాయిని సీజ్ చేశాం. ఈ కేసులో మొత్తం 11 మంది ఉండగా.. 10 మంది నిందితులను అరెస్ట్ చేశాం. కీలక నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నాడు. కేరళకు చెందిన శివన్కృష్ణన్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడుగా గుర్తించాం. పట్టుకున్న సొత్తు విలువ 90 లక్షలు ఉంటుంది." - మహేష్భగవత్, రాచకొండ సీపీ
ఇదీ చూడండి: