ETV Bharat / crime

iPhones seized: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 80ఐఫోన్లు సీజ్​ - తెలంగాణ తాజా వార్తలు

i phones
i phones
author img

By

Published : Jun 24, 2021, 6:31 PM IST

Updated : Jun 24, 2021, 7:44 PM IST

18:28 June 24

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 80ఐఫోన్లు సీజ్​

 శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో ఐఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 80 ఐఫోన్లను కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులతోపాటు వారి నుంచి ఫోన్లు తీసుకోడానికొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లగేజీ బెల్ట్‌ వద్ద నుంచి లగేజి తీసుకుని బయటకు వెళ్లే సమయంలో తనిఖీలు నిర్వహించి ఐఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ జె.ఎస్‌. చంద్రశేఖర్‌ తెలిపారు.

 అవన్నీ కూడా పన్నులు చెల్లించని, అక్రమంగా తెచ్చిన ఐఫోన్‌లుగా అధికారులు నిర్ధరించారు. 80 ఐఫోన్‌లు కూడా సరికొత్త మోడల్స్‌ అని, 12ప్రో, 12ప్రోమ్యాక్స్‌ మోడల్స్‌కు చెందినవిగా పేర్కొన్నారు. ఈ మొబైల్స్‌ ఒక్కొక్కటి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు విలువ చేస్తాయన్నారు. వాటి విలువ కోటి 65వేలు రూపాయలు ఉంటుందని వివరించారు. వాటితో పాటు మరో నాలుగు లక్షలు నగదు కూడా వారి నుంచి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు గుజరాత్‌కు చెందిన వ్యక్తికాగా, మరో ఇద్దరు హైదరాబాద్‌ జగదీష్‌ మార్కెట్‌కు చెందిన వారని సమాచారం.    

ఇదీ చూడండి: BIT COIN: బిట్‌కాయిన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

Last Updated : Jun 24, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.