ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. నర్సీపట్నంలోని అప్పన్నదొరపాలెం కూడలి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నక్కపల్లి మం. ఒడిమెట్ట వద్ద ఆగిఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆగిఉన్న వ్యాన్‌ను బైక్ ఢీకొట్టి ఒకరు మృతి చెందారు. మొత్తంగా ఏపీలో నేడు రహదారులు నెత్తురోడాయి.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ రాలేగావ్ సిద్ధి పర్యటన వాయిదా