ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 51వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ముగ్గురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రకాశ్, తిరుపతికి చెందిన డాక్టర్ సతీశ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ విచారణ జరుపుతోంది.
అంతకుముందు...
సోమవారం చేసిన విచారణలో సీబీఐ ఉన్నతాధికారి రామ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు... గంటన్నరకుపైగా వివేకా ఇంటితోపాటు, పరిసరాలు గమనించారు. కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం పలు విషయాలపై ఆరా తీశారు.
వివేకా ఇంట్లో ఉన్న ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో వారు మాట్లాడారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వారి దృష్టికి వచ్చిన విషయాలపై చర్చించారు.
వివేకా ఇంట్లో పరిశీలనల అనంతరం.. సీబీఐ అధికారుల బృందం పులివెందుల పట్టణంలో ఆర్ అండ్ బీ అతిథి గృహానికి వెళ్లింది. అక్కడ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, అతడి భార్యను అధికారులు ప్రశ్నించారు. వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం తర్వాత.. అనుమానితులను విచారణ చేశారు.
ఇదీ చదవండి: Viveka murder case: 'వివేకా ఇంట్లో పనివారంతా గంగిరెడ్డికి తెలుసు'