హైదరాబాద్ మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని సలీమ్నగర్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అధిక ధరకు అమ్ముతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ ఆసుపత్రిలో నర్సింగ్ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తున్న బనోత్ నరేశ్, సింధు ఆసుపత్రిలో ఎక్స్-రే టెక్నీషియన్లుగా పనిచేస్తోన్న నిమ్మ అశోక్, ధీరవత్ సైదా, ఎస్ఆర్ఎంఎస్ మ్యాన్ పవర్ సర్వీసెస్‌లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్లు అయిన మణికొండ హరిబాబు, రాఠోడ్ ఆకాశ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 3 రెమ్‌డెసివిర్ ఇంజిక్షన్లు, 6 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. బ్లాక్ మార్కెట్లో కొవిడ్ డ్రగ్స్‌ను అమ్మితే... చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ సుబ్బారావు హెచ్చరించారు.