యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోస్టాఫీసు పక్కన ఉన్న ఓ దుకాణంలో రూ.4లక్షల నగదు అపహరించారు. తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి పక్కనే ఉన్న మరో ఇంట్లో రూ.40 వేలు దోచుకున్నారు.
ఉదయాన్నే దుకాణం ఓపెన్ చేయడానికి వచ్చిన యజమాని.. తాళాలు తీసి ఉండటం చూసి అవాక్కయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా డబ్బులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో దుండగులు యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: గండిమైసమ్మ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య!