ETV Bharat / crime

PEDDAPALLI ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు సహా చిన్నారి దుర్మరణం - పెద్దపల్లి రోడ్డు ప్రమాదంలో 3 మృతి

PEDDAPALLI ACCIDENT
PEDDAPALLI ACCIDENT
author img

By

Published : Dec 20, 2021, 11:43 PM IST

Updated : Dec 21, 2021, 12:21 AM IST

23:35 December 20

ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు సహా చిన్నారి దుర్మరణం

PEDDAPALLI ACCIDENT: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌ వద్ద ప్రమాదం జరిగింది. రెండు లారీలు పరస్పరం ఢీకొని.. ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

రామగుండంకు చెందిన షేక్ షేకిల్ అతని భార్య రేష్మ, ఇద్దరు చిన్నారులు సహా మరో ఇద్దరు మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి వెళ్తున్నారు. గోదావరిఖని గంగానగర్ ఫైఓవర్​ యూటర్న్​​ వద్ద బొగ్గు లోడ్​తో వస్తున్న లారీ, మట్టిని తీసుకొస్తున్న మరో లారీ పరస్పరం ఢీకొట్టాయి. అనంతరం పక్కనే ప్రయాణిస్తున్న ఆటోపై బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో షేక్​ షేకిల్​, రేష్మ, మరో చిన్నారి మృతిచెందగా.. రెండు నెలల చిన్నారి సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలికి చేరిన పోలీసులు క్రేన్​ సాయంతో చిన్నారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి: Road accident today: ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ఇద్దరు మృతి

Last Updated : Dec 21, 2021, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.