ETV Bharat / crime

పొలాల్లో పడేసి వెళ్లిన 150 కిలోల గంజాయి స్వాధీనం - భద్రాచలంలో 20లక్షల విలువైన గంజాయి సీజ్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని శివారులోని పొలాల్లో సుమారు 20 లక్షల విలువైన గంజాయిని గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.

పొలాల్లో పడేసి వెళ్లిన 150 కిలోల గంజాయి స్వాధీనం

author img

By

Published : Mar 4, 2021, 12:27 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శివారులోని పొలాల్లో సుమారు 20 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం పొలంపనికి వెళ్ళిన రైతు గంజాయి ప్యాకెట్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించారు. సుమారు 100 ప్యాకెట్లు గంజాయి 150 కిలోల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఏపీ నుంచి..... భద్రాచలం మీదుగా కొందరు అక్రమార్కులు వరంగల్, హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలకు భయపడి పొలాల్లో పడేసి ఉంటారని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఓ నిండు ప్రాణం బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.