ETV Bharat / crime

భద్రాద్రిలో 178 కిలోల గంజాయి స్వాధీనం - భద్రాద్రి కొత్తగూడెం

దుమ్ముగూడెం మండలంలోని సీతానగరం గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న 178 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

178 kg of cannabis seized in Bhadradri
భద్రాద్రిలో 178 కిలోల గంజాయి స్వాధీనం178 kg of cannabis seized in Bhadradri
author img

By

Published : Apr 2, 2021, 9:05 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై రవికుమార్, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి సీతానగరం గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్తున్న కారును ఆపేందుకు సిబ్బంది ప్రయత్నించగా... కారును అక్కడే వదిలి డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.

సిబ్బంది వెంటనే అప్రమత్తమై... అతనిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 178 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్​కు చెందిన షేక్​ ఇర్ఫాన్​గా గుర్తించారు. కర్షద్​నగర్​కు చెందిన షేక్​ షారూక్​ వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. తన యజమాని ఆంధ్రా-ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఆదిలాబాద్​కు తరలిస్తారని పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.