Woman officer injured during CM visit: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్తున్న క్రమంలో మహిళా ఆఫీసర్ ప్రమాదానికి గురైంది. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ సిబ్బంది బయలు దేరారు. అయితే కాన్వాయ్ తిరిగి వెళ్లేటప్పుడు వాహనం నుంచి ఓ మహిళా సెక్యూరిటీ ఆఫీసర్ జారీ హైవే రోడ్డుపైన పడిపోయింది.
అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మహిళా అధికారిణికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇవీ చదవండి: