ETV Bharat / city

Warangal Mayor: అరగంటసేపు లిఫ్ట్​లోనే మేయర్​.. చెమటలు కక్కుతూ బయటకు..

ఆస్పత్రి ప్రారంభోత్సవం కోసం వెళ్లిన వరంగల్​ మేయర్​ గుండు సుధారాణికి లిఫ్ట్​ రూపంలో అవాంతరం ఎదురైంది. పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్​ ఎక్కగా... సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోయింది. అరగంట సేపు అందులోనే ఉండిపోయిన మేయర్​.. సిబ్బంది శ్రమతో ఎట్టకేలకు బయటపడ్డారు.

Warangal mayor Gundu Sudharani structed in hospital lift in Hanmakonda

author img

By

Published : Aug 12, 2021, 3:55 PM IST

అరగంటసేపు లిఫ్ట్​లోనే మేయర్​.. చెమటలు కక్కుతూ బయటకు

హన్మకొండలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్​లో చిక్కుకుపోయారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మేయర్​... పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. కొంత దూరం వెళ్లగానే.. లిఫ్ట్​ ఒక్కసారిగా ఆగిపోయింది. సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే లిఫ్ట్​ ఆగిపోవటంతో మేయర్​ అందులోనే చిక్కుకుపోయారు.

సుమారు అరగంట పాటు మేయర్​ లిఫ్ట్​లోనే ఉండిపోయారు. ఈ అనుకోని ఘటనతో హైరానా పడ్డ ఆసుపత్రి సిబ్బంది దాన్ని తెరిచేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత లిఫ్ట్​ తెరుచుకోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ మేయర్ సుధారాణి​.. ఒళ్లంతా చెమటలతో బయటకు వచ్చారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అప్పటివరకు ఆందోళన పడ్డ ఆస్పత్రి సిబ్బంది.. హమ్మయ్య అనుకున్నారు. మేయర్​కు కలిగిన అసౌకర్యానికి ఆస్పత్రి సిబ్బంది మేయర్​కు క్షమాపణలు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.