పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపంతో ఎవరికి వారే అన్న చందంగా భాజపా వ్యవహారం కనిపిస్తోంది. పనిచేసే వారికి గుర్తింపు లేకపోవడం, పొత్తుల కారణంగా టికెట్లు దక్కకపోవడం, గ్రూపు తగాదాలతో శ్రేణులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశాల్లో నేతలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థిగా సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తిని రంగంలోకి దించింది. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే... నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి చేసేందుకు తనకో అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. వరంగల్లో విజయం సాధించి పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు.
చింతా సాంబమూర్తి విజయం కోరుతూ.... ఈ నెల 4న అమిత్ షా వరంగల్లో పర్యటించనున్నారు. అమిత్ షా రాకతో.. జోష్ పెరిగి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలుపుబాటలో పయనిస్తామని కమలనాథులు విశ్వాసంతో ఉన్నారు.
ఇవీ చూడండి:నాయనమ్మను ఆదరించిన గడ్డమీద మనవడి ప్రచారం