ETV Bharat / city

వరంగల్​ నగర అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందన

భారీ వర్షాలు, ఉద్ధృతంగా వరదలొచ్చినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న వరంగల్​ జిల్లా అధికారులు, సిబ్బందిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. వరంగల్​లో పర్యటించిన మంత్రి.. తక్షణ సాయంగా సీఎం కేసీఆర్​ రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

telangana municipal minister ktr appreciated warangal city officers
వరంగల్​ నగర అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందన
author img

By

Published : Aug 18, 2020, 6:41 PM IST

వరంగల్​ నగరంలోని ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం నిట్ కళాశాల​లో అధికారులతో సమీక్షనిర్వహించిన మంత్రి తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతిరాఠోడ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నగరం మరోసారి ముంపు బారినపడకుండా తీసుకోవాల్సిన శాశ్వత చర్యలకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలు, ఉద్ధృతమైన వరదలొచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్న అధికారులను అభినందించారు.

నగరంలో దెబ్బతిన్న రహదారులకు సంబంధించి బుధవారంలోగా నివేదిక అందజేయాలని మంత్రి కేటీఆర్​ అధికారులను ఆదేశించారు. నాలాల ఆక్రమణలు అరికట్టడానికి జిల్లా అధ్యక్షతన కమిటీ వేయాలని సూచించారు. కరోనా నియంత్రణకు మరింత కృషి చేయాలని, ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో పడకలు పెంచాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.