తెలంగాణ ప్రభుత్వం.. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ చేస్తామని చెప్తే అనేక మంది డీడీలు కట్టి మూడేళ్లు గడుస్తున్నా.. పంపిణీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు వెంటనే న్యాయం చేయాలంటూ వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
సీఎం డౌన్‌డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గొల్ల, కురుమల కులస్తులకు నచ్చజెప్పగా ఆందోళనను విరమించుకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమపై దయ చూపి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని వేడుకున్నారు.
ఇదీ చదవండిః వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై గొల్లకురుమల రాస్తారోకో