ETV Bharat / city

'గుడుంబా తయారీదారులపై కఠినంగా వ్యవహరించండి' - గుడుంబా తయారీ

గుడుంబా తయారీ, అమ్మకం దారులను ఉక్కుపాదంతో అణిచివేయలని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఎక్సైజ్​ అధికారులను ఆదేశించారు.

warngal district latest news
warngal district latest news
author img

By

Published : May 24, 2020, 11:43 PM IST

గుడుంబా అమ్మకం, తయారీ చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఎక్సైజ్​ ఆదేశించారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండలోని ఆర్​ ఎండ్​ బీ అతిథి గృహంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

గుడుంబా తయారీ, అమ్మకం దారులపై పీడీ యాక్ట్​ కేసులను నమోదు చేయాలన్నారు. అలాగే బైండోవర్ కేసుల్లో లక్ష రూపాయల పూచీకత్తును కఠినంగా అమలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆబ్కారీ అధికారులు తమ పదోన్నతులపై శ్రీనివాస్​ గౌడ్​కు వినతిపత్రం ఇచ్చారు. అధికారులు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమీక్షా సమావేశంలో వరంగల్ అర్బన్ ఈఎస్​ బాల స్వామి, ఏఈఎస్​ శ్రీనివాస్ రావు, వరంగల్ ఏఈఎస్ శ్రీనివాస్, సీఐలు రామకృష్ణ, కరం చంద్, రంజిత్ రావు, ఎస్​ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.