ETV Bharat / city

VANTALAKKA: హాబీయే ఆదాయవనరు.. వంటలో ప్రేమలతకు సాటిలేరెవ్వరు - vantalakka from warangal

ఆమె బిర్యానీ చేసిందంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మిఠాయిలు తయారుచేస్తే.. వాహ్వా అంటూ ఆరగించాల్సిందే. వంట ఏదైనా.. సునాయాసంగా గరిటె తిప్పుతూ తినే వారితో ఆహా ఏమి రుచి అనిపించాల్సిందే. పాకశాస్త్రంలో ఆమెది అందె వేసిన చేయి. తనకు నచ్చిన పని.. వంట చేయడం. ఇప్పుడు దాన్నే ఉపాధిగా మలుచుకుని తను చేసే వంటను పది మందికి రుచిచూపిస్తున్నారు ఈ వంటలక్క(VANTALAKKA).

Warangal vantalakka
వరంగల్ వంటలక్క
author img

By

Published : Jul 9, 2021, 10:25 AM IST

కొందరికి వెరైటీ వంటలను తినడంలో ఆనందముంటే.. మరికొందరికి వాటిని తయారు చేయడంలో మజా వస్తుంది. సునాయాసంగా గరిటె తిప్పుతూ.. క్షణాల్లో వెరైటీలు వండిపెట్టే ఈమె పేరు ప్రేమలత. వరంగల్​లోని గోపాల్​పూర్ పరిధిలోని శ్రీనివాసనగర్​లో ఉండే ఈమెను అక్కడివారంతా ప్రేమగా వంటలక్క(VANTALAKKA) అని పిలుస్తుంటారు. ప్రేమలత ఎక్కువగా చదువుకోలేదు. కానీ పాకశాస్త్రంలో ఆమెది అందెవేసిన చేయి. టైం దొరికే కొత్తరకం పదార్థాన్ని తయారు చేసి ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు రుచిచూపించాల్సిందే.

వరంగల్ వంటలక్క

అందరి ఆడపిల్లల్లాగే.. పెద్దయ్యాక ఉద్యోగం చేసి అమ్మానాన్నలకు అండగా నిలవాలనుకున్నారు ప్రేమలత. కానీ.. పెళ్లితో ఆ కల అలాగే మిగిలిపోయింది. పెళ్లయ్యాక.. భర్త, అత్తమామలను చూసుకోవడం.. ఇంటిపని, వంటపనితోనే సరిపోయేది. ఆ తర్వాత పిల్లలు వారి ఆలనాపాలనాతో ఇంకొంత కాలం గడిచిపోయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లవ్వడంతో కాస్త తీరిక దొరికింది. ఈ ఖాళీ సమయాన్ని తనకు నచ్చిన పనికి కేటాయించాలనుకున్నారు ప్రేమలత.. తనకు అత్యంత ఇష్టమైన పాకశాస్త్రాన్నే ఆదాయవనరుగా మార్చుకోవాలనుకున్నారు. ఇంట్లోనే రకరకాల వంటలు తయారు చేయడం ప్రారంభించారు.

పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఖర్చులు కూడా పెరిగాయి. ఇంటికి ఆర్థికంగా కాస్త తోడవ్వాలనుకున్నాను. నేను పెద్దగా చదువుకోలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు.. నాకు బాగా తెలిసిన వంట చేయడమే బెటర్ అనిపించింది. ఇంట్లోనే వంటశాలను ఏర్పాటు చేసుకున్నా. మొదట్లో నలుగురైదుగురికి వంట చేసి సరఫరా చేశాను. నెమ్మదిగా ఆ సంఖ్య 150 మంది దాకా చేరింది. వంటలు రుచిగా ఉండటం, శుభ్రత పాటించడం వల్ల క్రమంగా ఆర్డర్లు పెరిగాయి.

- ప్రేమలత, క్యాటరర్

తయారు చేసిన వంటలతో ఇంట్లోనే ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. క్రమంగా ఆమె వంటలకు మంచి పేరు వచ్చి.. ఆర్డర్లు పెరగడం మొదలైంది. శుభకార్యాలు, వేడుకలకు కావాల్సిన పదార్థాలను ఇంట్లోనే తయారు చేసి సరఫరా చేయడం ప్రారంభించారు. నెమ్మదిగా ఆదాయం కూడా పెరగసాగింది.

కరోనా వల్ల బయట హోటళ్లు, రెస్టారెంట్లలో తినాలంటే భయమేస్తుంది. ఇంట్లో చేసుకోవాలంటే సమయం ఉండదు. అప్పుడే వంటలక్క(VANTALAKKA) గురించి తెలిసింది. చాలా సార్లు ఇక్కణ్నుంచి పార్శిళ్లు తీసుకెళ్లాం. ఆమె వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా శుభ్రంగా ఉంటాయి.

- వినియోగదారులు

ఆర్డర్లు పెరగడంతో స్నేహితులు చేదోడువాదోడుగా ఉంటున్నారు. స్థానికంగా ఉండేవారికి ప్రేమలత ఉపాధి కల్పిస్తున్నారు. కొవిడ్‌ వల్ల చాలా మంది హోటళ్లలో తినడానికి వెనకాడుతున్నారు. అది ఈ వంటలక్కకి అనుకూలంగా మారింది. ఉద్యోగం లేకున్నా... తెలిసిన వంటనే ఉపాధిమార్గంగా ఎంచుకొని... నాలుగు డబ్బులు వచ్చేలా చేస్తున్న ప్రేమలతను స్థానికులు అభినందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.