విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఓరుగల్లు చర్చిలు లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు క్రైస్తవ సోదరులు సిద్ధమైయ్యారు. కాజీపేట్లోని ఫాతీమా కెథడ్రిల్, హన్మకొండలోని సీజీసీ చర్చి, సర్క్యూట్ గెస్ట్ హౌస్ రూథర్ ఫోర్డ్ చర్చిల్లో చేసిన ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది. విద్యుద్దీపకాంతులతో చర్చి పరిసరాలు దేదీప్యమానమౌతున్నాయి. క్రిస్మస్ పండుగ రోజున.... చర్చిల్లో క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ... తిరిగి రేపు ఉదయం.... సాయంత్రం వేళల్లో దేవుని స్తుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం నగరంలోని అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏసు ఆగమనాన్ని కీర్తిస్తూ.. క్రైస్తవ బృందాలు భక్తి గీతాలతో సాధన చేస్తున్నాయి. క్రీస్తును స్తుతిస్తూ...పాటలు పాడుతున్నారు.
పాప ప్రక్షాళన చేస్తూ...ప్రేమ, కరుణ, మానవాళికి పంచిన ప్రభువు....జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటామని క్రైస్తవ సోదరులు చెపుతున్నారు.
క్రిస్మస్ పండుగ కోలహలం మార్కెట్లలోనూ కనిపిస్తోంది. గృహాలను ప్రత్యేకంగా అలంకరించుకునేందుకు... ధగధగమెరిసే క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు శాంతాక్లజ్ బొమ్మలు, ఇతర సామగ్రిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ చర్చి