వరంగల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హంటర్ రోడ్లోని బొందివాగు ప్రాంతంలో 13 ట్రాన్స్ఫార్మర్లు ఫ్యూజ్ పెట్టెల వరకు వరద నీటిలో మునిగిపోయాయి.
ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వరద నీరు తగ్గితేనే సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. బొంది వాగు పరిసరాల్లోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఇవీచూడండి: ఉగ్ర గోదావరి : మూడో ప్రమాద హెచ్చరిక జారీ