ETV Bharat / city

`కాలితో తొక్కి.. చేతులు కడుక్కునే యంత్రం!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోన వైరస్ ​నుంచి తప్పించుకోవడానికి చేతులు కడుక్కునే వినూత్న యంత్రాన్ని తయారుచేశాడు వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ముప్పారపు రాజు అనే యువ శాస్త్రవేత్త.

pedestal hand wash invented by warangal young man
`కాలితో తొక్కి.. చేతులు కడుక్కునే యంత్రం!
author img

By

Published : Apr 24, 2020, 5:20 AM IST

ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ కరోనా రోజురోజుకు మహమ్మారిలా విస్తరిస్తున్నది. కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. భౌతిక దూరం పాటిస్తూ, నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే.. ఒకరు ముట్టుకున్న సబ్బు, నల్లా, మగ్గు మరొకరు ముట్టుకోవడం వల్ల కూడా కరోనా సోకే ప్రమాదమున్నది. ఈ విషయం గమనించిన ముప్పారపు రాజు చేతులతో పట్టుకోకుండానే శానిటైజ్ చేసే యంత్రాన్ని తయారుచేశాడు. చేతులతో పట్టుకోకుండానే సైకిల్ తొక్కినట్టుగా స్టాండ్​కు అమర్చిన పైడిల్​ను తొక్కితే.. చేతులు శుభ్రం చేయడానికి ఉపయోగించే ద్రావణం, మరో పైడిల్ తొక్కితే నీళ్లు వస్తాయి.ఈ రెండు పైడల్స్ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవచ్చు.

దుగ్గొండి మండల ఎంపీడీవో గుంటి పల్లవి.. రాజు ఆలోచనను ప్రోత్సహించి ఈ యంత్రం రూపొందించడానికి సహకరించారు. ఈ యంత్రాన్ని దుగ్గొండి మండలం గిర్నిబావి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేశారు. నర్సంపేట ఎంఎల్ఏ పెద్ది సుధర్శన్ రెడ్డి ప్రారంభించి రాజును, ఎంపీడీవో పల్లవిని అభినందించారు. ఇలాంటి మరిన్ని యంత్రాలను మండలంలోని ప్రతీ గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయనున్నామని ఎంపీడీవో పల్లవి తెలిపారు.

ఇవీ చూడండి: ఈనాడు-ఈటీవీభారత్ 'కూలి'పోతున్నారు!' కథనానికి స్పందన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.