కనీసం రోడ్డు రవాణా లేదు
దూరప్రాంతాలకు వెళ్లవలసిన వారికి రైళ్ల రద్దు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయం తెలియని వారు రైల్వే స్టేషన్లో పడిగాపులు పడుతున్నారు. బస్సుల్లో వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగ్గా లేదని వాపోతున్నారు.
మళ్లీ అదే పరిస్థితి
కొన్ని రోజుల క్రితం కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే లైన్ మరమ్మతుల వల్ల పలు రైళ్లు రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ మార్గంలో అదే పరిస్థితి. ప్రయాణికులు మాత్రం దూరప్రాంతాలకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయకుండా వాటిని యధావిధిగా నడపాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:'తెలంగాణలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదు'