ఆర్టీసీ కార్మికుల 13వ రోజు సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తామనడం అహంకారమని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు వామపక్ష పార్టీల నేతలు తమకు సంపూర్ణ మద్దతిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వికారాబాద్లో ధూంధాం