ETV Bharat / city

డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. తాటి వనాల వైపు రామంటున్న కల్లు ప్రేమికులు... - warangal urban latest news

డ్రంకన్​ డ్రైవ్​ మందు బాబులనే కాదు.. కల్లుగీత కార్మికులను కూడా ఇబ్బంది పెడుతోంది. వరంగల్​ గ్రామీణ జిల్లాలో తాటి కల్లు విక్రయించే వారు ఎక్కువ. సాయంత్రమైతే మందు బాబుల కోసం పోలీసులు తాటి వనాల వద్దే కాపుకాస్తున్నారు. పోలీసులకు భయపడి చాలా మంది కల్లు ప్రియులు తాటి వనాలా వైపే చూడటం లేదు.

kallu geetha karmikulu
కొత్త చిక్కుల్లో కల్లు గీత కార్మికులు
author img

By

Published : Mar 6, 2020, 11:14 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండల కేంద్రంలో గీత కార్మికులకు ఎక్కడా లేని చిక్కొచ్చి పడింది. డ్రంకన్ డ్రైవ్ పేరుతో మందుబాబుల పని పడుతొన్న పోలీసుల చర్యలు.. గీత కార్మికుల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తున్నాయి. రోజు సాయంత్రం తాటి వనాల సమీపంలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించడం వల్ల కల్లు తాగేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.

డ్రంకన్ డ్రైవ్​లో మద్యం సేవించే వారి కంటే... ఎక్కువ సంఖ్యలో తాటి కల్లు తాగే వారే పోలీసులకు చిక్కుతున్నారు. శ్వాసపరీక్షల్లో మోతాదుకు మించి నమోదవ్వడం చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. ఇలా వరుస డ్రైవ్​లతో బెంబేలెత్తిపోతున్న కల్లు ప్రియులు... తాటివనాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఈ పరిస్థితుల్లో తమ జీవనోపాధి దెబ్బతింటోందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లు సేవించే వారిపట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాలని గీత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొత్త చిక్కుల్లో కల్లు గీత కార్మికులు

ఇవీ చూడండి:రైతుబంధుకు మరో రూ.333కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.