ETV Bharat / city

ఓరుగల్లులో ముగిసిన సాంస్కృతిక మహోత్సవం

హనుమకొండలో రెండురోజుల పాటు జరిగిన సాంస్కృతిక మహోత్సవం ఆద్యంతం అలరించింది. పాటలు, జానపద, సంప్రదాయ నృత్యాలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలూ కనువిందు చేశాయి. రేపటి నుంచి మూడురోజుల పాటు హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు.

national sanskriti Mahotsav
national sanskriti Mahotsav
author img

By

Published : Mar 31, 2022, 6:52 AM IST

ఓరుగల్లులో ముగిసిన సాంస్కృతిక మహోత్సవం

ఘనమైన మన సంస్కృతి, సంప్రదాయలు... భవిష్యత్ తరాలకు అందాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో.. ఆగస్టు 15న భారతీయులందరి ఇళ్లపైనా జాతీయ జెండా ఎగరేయాలని ఆయన పిలుపునిచ్చారు. హనుమకొండలో రెండురోజుల పాటు జరిగిన సాంస్కృతిక మహోత్సవం ముగింపు వేడుకల్లో కిషన్​రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణ: చారిత్రక నగరిలో సాంస్కృతిక మహోత్సవం ఘనంగా ముగిసింది. కళాకారుల ప్రదర్శనలు.. అందరిని విశేషంగా అలరించాయి. హనుమకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం.. ఆద్యంతం అలరించింది. పాటలు, జానపద, సంప్రదాయ నృత్యాలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలూ కనువిందు చేశాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజారెడ్డి చేసిన కాకతీయల కళా వైభవం నృత్య ప్రదర్శన.. ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన డప్పు, డోలు వాయిద్యాలు.. యుద్ధ కళల ప్రదర్శనలు.. ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సినీ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ బృందం చేసిన సినీ విభావరి.. విశేషంగా ఆకట్టుకుంది. మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి స్టేజ్‌పై ఉండగా.. రాములమ్మ పాటతో.. వందేమాతరం శ్రీనివాస్‌ ఉర్రూతలూగించారు. ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని విజయశాంతి కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు కళాకారులు ఎంతో కష్టపడ్డారని.. కానీ ఆ తర్వాత వారికి తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆరోపించారు.

భాగ్యనగరంలో..: రేపటి నుంచి మూడురోజుల పాటు హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. ఇది రాజకీయాలకతీతంగా జరుగుతున్నాయన్నారు. కేంద్రం తరఫున ఉపరాష్ట్రపతి, గవర్నర్లతోపాటు.. ముఖ్యమంత్రి, మంత్రులనూ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పద్మశ్రీ వనజీవి రామయ్యతోపాటు.. వివిధ రంగాల్లో ప్రముఖులు, ప్రదర్శనలిచ్చిన కళాకారులను కేంద్రమంత్రి సన్మానించారు.

ఇదీచూడండి: Bhadradri Temple: శ్రీరామనవమి ఉత్సవాలకు సిద్ధమవుతున్న భద్రాద్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.