ముఖ్యమంత్రి కేసీఆర్ దొరల పాలన కొనసాగించాలని చూస్తే ఊరుకునేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ... హన్మకొండ కేడీసీ గ్రౌండ్‌లో ఆదివారం మహాదీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీక్షకు కార్యకర్తలు, వెనుకబడిన వర్గాల వారు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: మద్యం దుకాణాల లైసెన్సుల గడువు పెంపు!