ETV Bharat / city

పేదల ఆకలి తీరుస్తున్న మోక్షారామం స్వచ్ఛంద సంస్థ - తెలంగాణ తాజా వార్తలు

సాయం చేయాలంటే దానకర్ణుడే దిగిరానక్కర్లేదు. ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవడం సోనూసూద్‌ ఒక్కడి పనేకాదు.. సాటి మనిషిగా తోచినసాయం ఎవరైనా చేయవచ్చు. ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలవచ్చు. నలుగురు కలిస్తే 400 మంది ఆకలి తీర్చవచ్చు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థల్లో సభ్యులుగా ఉన్నవాళ్లు ఇలాగే సేవాభావం చాటుతున్నారు. పేదవాడి నోట్లోకి ఐదేళ్లు వెళ్లేలా చేయూతనిస్తున్నారు.

Moksharam is a charity that feeds the poor  people of ramannapet in Warangal district
పేదల ఆకలి తీరుస్తున్న మోక్షారామం స్వచ్ఛంద సంస్థ
author img

By

Published : May 26, 2021, 5:00 AM IST

పేదల ఆకలి తీరుస్తున్న మోక్షారామం స్వచ్ఛంద సంస్థ

వరంగల్ జిల్లా రామన్నపేటలోని మోక్షారామం స్వచ్ఛంద సంస్థ పెద్దమనసు చాటుకుంటోంది. లాక్‌డౌన్‌ వేళ.. ఆకలితో అలమటిస్తున్నారికి అండగా నిలుస్తోంది. చేసేందుకు పనిలేక పూటగడవని వారికి కష్టకాలంలో ఆసరాగా నిలుస్తోంది. ఉదయం 10 గంటలకే ఆంక్షలు అమల్లోకి వస్తుండగా.. కూలీలు, చిరువ్యాపారులకు భోజనం దొరకడం గగనంగా మారుతోంది. అలాంటి వారికి ఆహార పొట్లాలు అందిస్తూ కడుపు నింపుతోంది మోక్షారామం స్వచ్ఛంద సంస్థ. గతేడాది లాక్‌డౌన్ సమయంలోనూ వరంగల్ పరిసర ప్రాంతంలో ఇలాగే సేవలు అందించింది.

ఘుమఘులతో..

భోజనం తయారీలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. నాణ్యమైన పదార్థాలను వినియోగిస్తున్నారు. శుభకార్యాలు, వివాహ వేడుకలను తలపించేలా ఘుమఘులతో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వేడివేడి పులావ్‌ వండి ఆకలితో ఉన్నవాళ్లకు అందజేస్తున్నారు. వేడి, రుచి తగ్గకుండా అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్‌ చేస్తున్నారు. అందులోనూ ఏదో నాలుగు మెతుకులు అన్నట్లుగా కాకుండా.. కడుపునిండేలా పెడుతున్నారు. అవసరమైన ప్రొటీన్స్‌ అందేలా ఉడకబెట్టిన గుడ్డును కూడా అందిస్తున్నారు.

చేయాతనిస్తున్నారు..

ఉదయం నుంచి వంటలు సిద్ధం చేసుకొని.. వాటిని ఆన్నార్థుల చెంతకు చేరుస్తున్నారు స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఆహార పొట్లాను ఆటోల్లో తీసుకెళ్లి రహదారులపై తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధులతో తీరక లేకుండా శ్రమిస్తున్న పోలీసులకు అండగా నిలుస్తున్నారు. పోలీస్‌ సిబ్బందికి సైతం భోజనం సమకూరుస్తూ చేయాతనిస్తున్నారు.

మోక్షారామం స్వచ్ఛంద సంస్థ సేవలపట్ల నిరాశ్రయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆపదవేళ అన్నం పెడుతూ ప్రాణాలు నిలుపుతున్నారని ప్రశంసిస్తున్నారు.

ఇవీ చూడండి: సెప్టెంబర్​ నాటికి కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.